Monday, May 20, 2024
- Advertisement -

నిజమా.. బుడ్డొడ్ని తొక్కేస్తున్నారా..

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు తొక్కేస్తున్నారు. ఆయన సినిమా ఎంత బాగున్నా.. వాటిని చంద్రబాబు ఆడనివ్వడం లేదు. అంతే కాదు.. ఆయన సినిమాలు విడుదల కాకుండా కూడా చంద్రబాబు అడ్దుకుంటున్నారు. ఇదేంటి.. ఈ లాజిక్ అనుకుంటున్నారా. నిజం. ఈ మాటలన్నది ఎవరో కాదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా సాక్షాత్తు ఈ మాటలన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పప్పు సుద్ద అని, ఆ సుద్ద పైకి రావాలంటే జూనియర్ ను తొక్కేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిట్ కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారట.

నిజమే.. బాహుబలిని మించి హిట్ కొట్టి చరిత్ర తిరగరాయాల్సిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని హిట్ కాకుండా చంద్రబాబే ప్లాన్ చేశారు. ఏడాది సస్పెన్షన్ తర్వాత.. కోర్టులు చుట్టూ తిరుగుతున్న హైరానాలో రోజా ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలియడం లేదు. అయినా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వెనుకేసుకొస్తే రోజాకు వచ్చే మేలేంటో మాత్రం బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఎవరికి అర్ధం కావడం లేదు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -