Saturday, May 4, 2024
- Advertisement -

ఒకరోజు.. 14 సినిమాలు..

- Advertisement -

ఇదేదో సినిమా పేరులా ఉంది అనుకుంటున్నారా.. కాదు కాని.. ఇందులో ఓ తమాషా ఉంది. పిల్లలకి పరీక్షలు అయిపోతాయి. సెలవులు ఇచ్చేస్తారు.  దీంతో కొత్త సినిమాలను విడుదల చేసేసి ఒక్క రోజులోనే డబ్బులు కొల్లగొట్టేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి.

ఈ చిత్రాలతో చిన్న నిర్మాతలు కూడా తమ సినిమాలు విడుదల చేసి అగ్రహీరోల మధ్య తాము హిట్లుకొట్టేసి డబ్బులు చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో వచ్చే శుక్రవారం నాడు చిన్నా, పెద్దా కలిపి ఏకంగా 14 సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

ఇందులో ఎన్నిహిట్టో..ఎన్నిఫట్టో తెలియదుకాని.. ఇలాఒకే రోజు 14 సినిమాలు విడుదల కావడం మాత్రం ఓ రికార్డే. ఈ చిత్రాల్లో చిన్నహీరోలు పక్కన పెడితే రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఎటాక్ చిత్రం కూడా ఉంది.ఇందులో భారీతారాగణం మంచుమనోజ్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు అగ్రతారలు నటిస్తున్నారు. అలాగే నారా రోహిత్ నటించిన సావిత్రి చిత్రం కూడా ఈ శుక్రవారమే విడుదలవుతోంది.చూడాలి ఎవరి అదృష్టం ఎలాఉందో…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -