- Advertisement -

సువేందు అవినీతి పరుడు..మోదీ వీడియో వైరల్

- Advertisement -

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సువేందు అధికారిపై తీవ్ర విమర్శలు చేసిన మోదీ, ఆయనను “అత్యంత అవినీతిపరుడు”గా అభివర్ణించినట్లు కనిపిస్తోంది.

2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న సువేందు అధికారిపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ముఖ్యంగా నారదా, శారదా చిట్‌ఫండ్ కేసుల నేపథ్యంలో అప్పటి ప్రచార సభల్లో మోదీ సహా పలువురు బీజేపీ నేతలు టీఎంసీ నాయకత్వాన్ని అవినీతికి ప్రతీకగా విమర్శించారు. ఆ సమయంలో చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు మళ్లీ చక్కర్లు కొడుతోంది.

ఒకప్పుడు అవినీతి నాయకుడని విమర్శించిన వ్యక్తినే ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ తన పాత ఆరోపణలను మర్చిపోయిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

2020లో తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సువేందు అధికారి బీజేపీలో చేరారు.

https://twitter.com/bigtvtelugu/status/2053013224799256827/video/2

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -