2014లో పొట్టకూటికోసం ఇరాక్ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఆర్మీ విమానంలో బాగ్ధాద్ నుంచి అమృత్‌సర్(పంజాబ్)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారుఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో నిండిపోయాంది.
ఉగ్రవాదుల చేతిలో మొత్తం 39 మంది మరణించగా.. వీరిలో 27 మంది పంజాబ్‌కు, ఆరుగురు బీహార్‌కు, నలుగురు హిమాచల్ ప్రదేశ్‌కు, మరో ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారున్నారు. ఓ వ్యక్తి డీఎన్‌ఏ నమూనాలు 75 శాతం మాత్రమే సరిపోలడంతో అతడి మృతదేహాన్ని పంపించడంలో జాప్యం జరుగుతోంది. మిగిలిన 38 మంది మృతదేహాల డీఎన్‌ఏ నమూనాలు 95 శాతం వరకు సరిపోలాయి.
సోమవారం తీసుకొచ్చిన 38 మృతదేహాల్లో 27 దేహాలను పంజాబ్‌లోనే దించేశారు. అక్కడి నుంచి ఆయా మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మిగిలిన మృతదేహాలను పట్నాకు తరలించారు. ఉపాధికోసం రాక్‌లోని మోసుల్ నగరానికి వెళ్లిన 40 మంది భారతీయులను కిడ్నాప్ చేశారు. మోసుల్ నుంచి తిరిగి వస్తుండగా అడ్డగించిన ఉగ్రవాదులు వీరిని బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపంచేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నించింనా ఫలితం లేకుండా పోయింది.కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల లోక్‌సభలో వారంతా చనిపోయారని ప్రకటించడంతో దేశం నివ్వెరపోయింది.
ఇరాక్ అధికారులు గతేడాది జులైలో మోసుల్ నగరంలో ఒకే చోట వందల సంఖ్యలో సామూహిక సమాధులు గుర్తించారు. ఈ క్రమంలో 39 మంది భారతీయులు చనిపోయినట్లు తేలింది. మృతదేహాలను సమాధుల నుంచి వెలికితీసి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించామని, దీంతో వారంతా మరణించినట్లు నిర్ధారించామని సుష్మాస్వరాజ్ తెలిపారు.