ఒలింపిక్స్ క్రీడలపై చైనా వక్రబుద్ధి

- Advertisement -

చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. నేటి నుంచి (ఫిబ్రవరి 5) నుంచి బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల క్రితం గల్వాన్ లోయలో భారత సైన్యంపై జరిపిన దొంగదాడిలో పాల్గొన్న తమ ఆర్మీ రెజిమెంట్ కమాండర్ ను ఒలింపిక్స్ క్రీడల టార్చ్ బేరర్ గా చైనా ప్రకటించింది.

దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విశ్వ క్రీడలను రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం దురద్రుష్టకరమని భారత విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందుకు నిరసనగా ఒలింపిక్ ప్రారంభ ముగింపు వేడుకలను హాజరు కాబోమని అరిందం బాగ్చీ తెలిపారు.

- Advertisement -

చైనా నిర్ణయాన్ని అమెరికా సైతం తప్పుబట్టింది. ఈ క్రీడలను దూరదర్శన్ లోనూ ప్రసారం చేయబోమని ప్రసారభారతి సీఈఓ శేఖర్ వెంపటి స్పష్టం చేశారు. కాగా ఈ క్రీడల్లో 90 దేశాల నుంచి మూడు వేల మంది అథ్లెట్టు 15 రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొంటారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -