Wednesday, May 8, 2024
- Advertisement -

ఇరిగేషన్ మంత్రి మోసం చేస్తున్నాడా?

- Advertisement -

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై.. కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి.. జనాన్ని హరీష్ రావు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ తాను.. హరీష్ అంటే మంచివాడు అనుకున్నానని.. కానీ.. తన తీరుతో హరీష్ రావే.. మోసగాడని నిరూపించుకుంటున్నాడని ఘాటుగా కామెంట్లు చేశారు.

ఇన్నాళ్లూ హరీష్ ను విమర్శించాలంటే.. ప్రత్యర్థి పార్టీ నేతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. అన్నీ నిర్థారించుకున్నాకే.. కామెంట్లు చేసేవారు. అలాంటిది.. వీహెచ్ ఈ స్థాయిలో ఎందుకు హరీష్ ను తప్పుబట్టారా అన్నది.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వీహెచ్ కామెంట్లపై హరీష్ రావు అనుచరులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ఏ విషయాన్ని వివాదం చేయకుండా.. జాగ్రత్తగా హేండిల్ చేయడంలో హరీష్ దిట్ట అన్నది అందరికీ తెలుసు. అందుకే.. వీహెచ్ కామెంట్లను కూడా రాజకీయాల్లో భాగంగా లైట్ తీసుకుని.. చాన్స్ దొరికినపుడు ఆయన స్పందించే అవకాశం ఉందని.. కొందరు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -