Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రభాస్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు!

- Advertisement -

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఒక్కో దేశంలో వరస గా ఈ చిత్రం రిలీజ్ అవుతూ వస్తుంది. రిలీజ్ అయిన ప్రతి చోట సంచలనం సృష్టిసున్నే ఉంది. అయితే ఈ బాహుబలి చిత్రం తాజాగా ఫ్రాన్స్ లో విడుదలైయింది. అయితే ఇందులో ప్రభాస్ నటన ఫ్రాన్స్ వారి తెగ నచ్చేసిందంట. బాహుబలి సినిమా చూసి సంతోషించిన ఫ్రాన్స్ ఆడియన్స్ ప్రభాస్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారట.

సినిమా కంప్లీట్ అవ్వగానే ఆడిటోరియం లోని 14వందల మంది ఒక్కసారిగా లేచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం చప్పట్ల వర్షం కురిపించారట. అలాగే రాజమౌళి దర్శకత్వం, అనుష్క, తమన్నా ల నటన, వి ఎఫ్ ఎక్స్ నిపుణుల పని తీరు పై ఫ్రాన్స్ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది విడుదలైన బాహుబలి 600 కోట్ల వసూళ్ళ ని సాధించింది.

మరి ఇప్పుడు వస్తున్న బాహుబలి పార్ట్ 2 ఇంకెన్ని వందల కోట్లు సాధిస్తుందో చూడాలి. బాహుబలి పార్ట్ 2 ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ ని జరుపుకుంటుంది. ఈ క్లైమాక్స్ లో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం రాజమౌళి బాహుబలి పార్ట్ 1 కన్న బాహుబలి పార్ట్ 2 మరింత అద్భుతంగా వచ్చేలా తెరకెక్కిస్తున్నాడట. బాహుబలి పార్ట్ 2 వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -