- Advertisement -
చికెన్ కంటే మటన్ మరీ చీపా అని తమిళ ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకనుకుంటున్నారా… అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కార్యకర్తలకు పెట్టిన మటన్ బిర్యానీ ప్లేటు 20 రూపాయలు చెల్లించినట్లుగా ఎన్నికల కమిషన్ కు నివేదించాయి.
శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి 28 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవడం ఎవరికైనా సాధ్యమా. అందుకే లెక్కలు తారుమారు చేసి చూపించడంలో భాగంగా మటన్ బిర్యానీ ప్లేటు 20 రూపాయలు చెల్లించినట్లు చెప్పారు.
ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికల్లో కొన్ని పార్టీలు కార్యకర్తలకు పచ్చడి మెతుకులు మాత్రమే పెట్టామని చెప్పారు. ఇంతకీ దీనికి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా… కేవలం 10 లక్షల రూపాయలు. ఏది ఏమైనా తమిళ తంబీలు రొంబ హుషారప్పా…