Friday, April 19, 2024
- Advertisement -

సంపేసినవ్ లోకేశా….. హద్దులు చెరిపేసిన కామెడీతో అదరగొట్టావ్

- Advertisement -

నాయకుడంటే ఎవరు? నాయకుడి లక్షణాలు ఏంటి? అన్న ప్రశ్నలకు మన నారా లోకేష్ బాబుని చూసి నేర్చుకోండి అనే స్థాయిలో టిడిపి భజన మీడియా, బాబు సన్నిహితులు ఓ రేంజ్‌లో లోకేష్‌బాబుని ఆకాశానికెత్తేస్తూ ఉంటారు. ఆఫ్కోర్స్…….ఇక్కడ కూడా టిడిపిలో ఉన్న చాలా మంది నాయకులు లోకేష్‌ నాయకత్వాన్ని నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే అని కామెంట్స్ చేస్తూ ఉంటారనుకోండి. అది వేరే విషయం. కానీ బాబు ప్రాపకం కోసం పాకులాడే భజన మీడియా, బాబు సన్నిహిత నాయకులు మాత్రం నాయకత్వం అంటే లోకేష్‌దే అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే లోకేష్ బాబు మాత్రం అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తనకు జాకీలేసి లేపుతున్న వాళ్ళ పరువుతీస్తున్నాడు. తాను కూడా కామెడీ అయిపోతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం పోయేలా ఉండడంతో తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వంతో అయినా అధికారాన్ని పంచుకోవాలన్న ఆశతో ఉన్నాడు చంద్రబాబు. అయితే నారా లోకేష్ మాత్రం మన మతం ఆంధ్రా, కులం ఆంధ్రా, పార్టీ ఆంధ్రా అంటూ ఏవో భారీ డైలాగులు పేల్చి బాబు ఆశలకు తూట్లు పొడుస్తున్నాడు. రాజకీయ ప్రసంగాల విషయం పక్కన పెడితే లోకేష్ బాబు ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ని, తెలివితేటలను అనుమానించే విషయం ఇప్పుడు ఒకటి నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు చెత్త నుంచి సంపదను సృష్టిస్తాం అని గొప్పగా మాట్లాడేస్తున్నారు. కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మన లోకేష్ బాబు మాత్రం రివర్స్‌లో ‘సంపద నుంచి చెత్తను సృష్టిస్తాం’ అని చెప్తున్నాడు. అది కూడా ట్విట్టర్‌లో ఈ విషయంపైనే భారీగా రాసుకొచ్చాడు. మొత్తంగా సంపదను అంతటినీ చెత్తగా మార్చే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ ఒన్‌గా ఎదుగుతోందని, ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నానని, నా వంతు ప్రయత్నాన్ని సిన్సియర్‌గా చేస్తున్నానని చెప్తుకొచ్చాడు లోకేష్.

చెత్త నుంచి సంపదను సృష్టించే నాయకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. మరి సంపదనంతా కూడా చెత్తగా మార్చేస్తాను అని గర్వంగా చెప్పుకుంటున్న లోకేష్‌లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమో కాదో సీమాంధ్రులే తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసిందని విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -