Saturday, May 11, 2024
- Advertisement -

భార‌త్‌కు ఆదిలోనె ఎదురు దెబ్బ‌..తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -

రాజ్‌కోట్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తొలి టెస్టుకు దూరం కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఆట ప్రారంభ‌మ‌యిన కొద్ది సేప‌టికే భారత్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ నాలుగు బంతులాడి డక్కౌట్ గా పెవీలియన్ చేరాడు. బ్యాటింగ్ ప్రారంభించిన పృధ్వీషా, తానాడిన రెండో బంతికి టెస్టు కెరీర్ లో పరుగుల వేటను ప్రారంభించాడు. బౌండరీ దిశగా దూసుకెళుతున్న బంతిని వెస్టిండీస్ ఆటగాడు కీమో పాల్ ఆపగా, ఈలోగా మూడు పరుగులు వచ్చాయి. ఆపై నాలుగు బంతులాడిన రాహుల్ గాబ్రియేల్ బౌలింగ్ లో అరెస్టయ్యాడు.

దీంతో తొలి ఓవర్ లోనే భారత్ తన తొలి వికెట్ ను చేజార్చుకుంది. ప్రస్తుతం భారత స్కోరు రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో పృధ్వీషా (32), చ‌టేశ్వ‌ర్ పుజారా (21) ఉన్నారు.ప్ర‌స్తుతం స్కోర్ 55/1.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -