ట్రంఫ్ ఎపెక్ట్, అంతర్జాతీయం వస్తున్న మార్పులకారనంగా ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులంటూ వస్తున్న వార్తలను సాఫ్ట్‌వేర్ కంపెనీల అసోసియేషన్ (నాస్కామ్) తోసిపుచ్చింది .
ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని ఈ రంగం భర్తీ చేసుకోనుందని తెలిపింది. టెక్కీలు ఐటీ పరిశ్రమలో కొనసాగాలనుకుంటే మాత్రం తమ నైపుణ్యాలను మెరుగుదిద్దుకోవాల్సిందేనని సూచించింది.
{loadmodule mod_custom,Side Ad 1}
గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు 1.7 లక్షల నియామకాలు చేపట్టాయి. గత త్రైమాసికంలోనే అగ్రగామి 5 కంపెనీలు 50,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నాయి’ అని నాస్‌కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ తెలిపారు.ఆటోమేషన్, రోబోటిక్స్, అనలైటిక్స్, సైబర్ సెక్యూరిటీ తరహా కొత్త టెక్నాలజీల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న క్రమంలో ఉద్యోగులు తిరిగి నూతన నైపుణ్యాలను సంతరించుకోవాలని లేకుంటే మనుగడ సాగించలేరని ఆయన తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 2}
టెక్ స్టార్టప్‌లు, ఈకామర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ వంటి కొత్త అవకాశాల నేపథ్యంలో 2025 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. ఏటా పనితీరు మదింపు అనంతరం కొంత మంది ఉద్యోగులను తొలగించడం అన్నది ఐటీ పరిశ్రమలో సహజంగా జరిగే ప్రక్రియ. ‘‘ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం భిన్నంగా ఏమీ ఉండదన్నారు.ఉద్యోగులకు శిక్షణ, కొత్త టెక్నాలజీలపై నైపుణ్య సాధన కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని వాటిని నిరుద్యోగులు వినియేగించుకోవాలన్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}