- Advertisement -

ఇండిగో ఎయిర్‌లైన్స్ లో సింధుకు చేదు అనుభ‌వం…

- Advertisement -

బ్యాడ్మింటన్‌ స్టార్‌, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో ఎయిర్‌లైన్‌ సిబ్బంది ఒకరు ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పీవీ సింధునే తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవ్వ‌డంతోపాటు వైర‌ల్ అయ్యాయి. త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని చెప్ప‌డానికికూడా బాధాకంగా ఉంద‌న్నారు.

హైదరాబాద్‌ నుంచి ముంబైకి 6ఈ 608 విమానంలో బయలుదేరడానికి వెళ్లిన నాకు, గ్రౌండ్‌ స్టాఫ్‌ అజితేష్‌ నుంచి చాలా చేదు అనుభవం ఎదురైంది” అని సింధు పేర్కొన్నారు. విమాన సిబ్బందిలోని అజితేశ్‌ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సింధు ట్విటర్‌ ద్వారా తెలిపారు.

అజితేష్‌ చాలా అనాగరికంగా ప్రవర్తించాడ‌ని… ఎయిర్‌హోస్టస్‌ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించినా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడంది. దాన్ని చూసి నేను చాలా షాక్‌ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి” అని మరో ట్వీట్‌ చేశారు. విమాన ప్రయాణాల్లో దేశీయ క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌లు చేదు అనుభవాలను చవిచూశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -