Sunday, June 16, 2024
- Advertisement -

పెళ్లి భోజనాల‌లో బంగారం వ‌డ్డిస్తున్నారు… సోషియ‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌

- Advertisement -

మారుతున్న కాలానికి అనుగునంగా ప్ర‌జ‌లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ విష‌యంలోను కొత్త ద‌నాన్ని కోరుకుంటున్నారు. ప్ర‌ధానంగా పెళ్ళిల్లు, పుట్టిన రోజులు , ఇత‌ర ఫంక్స‌న్‌ల‌లో త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు ఖ‌ర్చులు పెట్ట‌డం సాధార‌ణం అయ్యింది. ఇది వారి స్టేట‌స్ సింబ‌ల్‌గా భావిస్తారు. పెళ్లిల్ల ఖ‌ర్చుల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అథిదుల‌కోసం కోట్లు ఖ‌ర్చుపెట్టి ర‌క‌ర‌కాల వెరైటీ వంట‌లు వ‌డ్డిస్తుంటారు. ఇది కామ‌నె…కాని ఇప్పుడు తాజాగా బంగారు అన్నం వ‌డ్డిస్తున్నారు అథిదుల‌కు.ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది.

బంగారు అన్నం ఏంటి అనుకుంటున్నారా…? మీరు విన్న‌ది నిజ‌మండి. దేశంలో మొట్ట మొద‌టి సారిగా పెళ్లిళ్లలో బంగారు అన్నం వడ్డిస్తున్నారు. ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన వివాహంలో ఓ క్యాటరింగ్ సంస్థ అందించిన సర్వీస్ ఇది.

స్వీట్స్ పై బంగారం, వెండి కోటింగ్ ఎలాగో.. ఇప్పుడు గోల్డ్ రైస్ అలా. ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాని మోతాదులో బంగారు పూతను తయారు చేస్తారు. దీన్ని ఓ పేపర్ పై అంటిస్తారు. భోజనం దగ్గర కూర్చున్న అతిధులకు వేడి వేడి అన్నం వడ్డించిన తర్వాత ఈ పేపర్ ఇస్తారు. దాన్ని అన్నంపై గట్టిగా ప్రెస్ చేసి తీయగానే గోల్డ్ పేపర్ మీ రైస్ పై మెరుస్తూ ఉంటుంది. బంగారాన్ని కలుపుకుని తినేయటమే.

గోల్డ్ రైస్ ఖ‌రీదుకూడా చాలా త‌క్కువ‌. ప్లేట్‌కు రూ. 300 ఖ‌ర్చు అవుతుంద‌ట‌. పెళ్లిల్ల‌లో ఎప్పటి నుంచో బంగారం కలిపి తింటున్నాం.. ఇప్పుడు రైస్ కు దాన్ని ప్రయోగాత్మకంగా ప్రయత్నించాం అంటోంది కేటరింగ్ యాజమాన్యం. పెళ్లిని ఆర్భాటంగా చేయటంతోపాటు ప్రత్యేకత కావాలని కస్టమర్లు కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఇక నుంచి ప్ర‌తీ పెళ్లిల్ల‌లోను గోల్డ్‌రైస్‌ను వండుతార‌నడంలో సందేహంలేదు. వెరైటీ కావాలనుకునే వారికి దీనికి మించింది మ‌రొక‌టిలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -