Sunday, May 11, 2025
- Advertisement -

కొత్త వైరస్.. భారతీయ విద్యార్థులకి కొత్త తిప్పలు..!

- Advertisement -

కొత్త కరోనా వైరస్​ స్ట్రెయిన్​ ఉప్పెనలా విస్తరిస్తున్న తరుణంలో.. విమాన సర్వీసులను రద్దు చేస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్​లో చిక్కుకుపోయారు. దీంతో క్రిస్మస్, కొత్త సంవత్సర​ వేడుకల సమయంలో స్వదేశానికి రావాలనుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు.

చాలా మంది విద్యార్థులు జనవరి ప్రారంభానికి ముందే స్వదేశానికి చేరుకుని సెలవు కాలంలో కుటుంబాలతో గడపాలనుకున్నారు. అయితే బ్రిటన్​లో ఇరుక్కుపోవడం వల్ల వారి పరిస్థితి అయోమయంగా ఉంది,” అని యూకే జాతీయ విద్యార్థి యూనియన్ ఛైర్​పర్సన్ సనన్ అరోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లండన్​లోని భారత హైకమిషన్​ సామాజిక మాధ్యమాల వేదికగా భారత పౌర విమానయాన శాఖకు పలు సందేశాలను పంపుతోంది.

ముందస్తు జాగ్రత్త చర్యగా బ్రిటన్​ విమానాలపై మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల​ 31 వరకు నిషేధం విధించింది భారత్​. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -