Wednesday, May 1, 2024
- Advertisement -

బ్రిటన్ లో కొత్తరకం వైరస్.. అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు!

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్‌తో బెంబేలెత్తుతున్న బ్రిటన్‌పై ఇప్పుడు మరో పిడుగు వచ్చి పడింది. దక్షిణాఫ్రికాలో మార్పు చెందిన కొత్త రకం వైరస్ ఆ దేశంలో అడుగుపెట్టింది.

ఇది చాలా ప్రమాదకారి అని, చాలా త్వరితంగా ఉత్పరివర్తన చెందుతోందని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. కొత్త రకం వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించింది.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన లాక్‌డౌన్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు 15 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -