Friday, April 26, 2024
- Advertisement -

బికినీ ఫొటోపై విమర్శకులకు కంగనా కౌంటర్..!

- Advertisement -

బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రౌనత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మెక్సికోలోని తులం దీవిలో బికినీతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన కంగన.. తాను సందర్శించిన అద్భుతమైన ప్రదేశాలలో ఇది ఒకటని దానికి క్యాప్షన్ తగిలించింది. అయితే దీనిపై ఓ వర్గం వారి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

భారతీయ విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడే నువ్వు ఇలాంటి దుస్తుల్లో కనిపించడం ఏంటంటూ దుమ్మెత్తి పోశారు. దాంతో మండిపోయిన కంగనా రౌనత్ తన బికినీ ఫొటోపై విమర్శలు చేస్తున్న వారికి ఘాటుగా జవాబిచ్చింది. మతంపై మీకే సర్వాధికారాలు ఉన్నట్టు నటించొద్దని హితవు పలికింది.

ఒకవేళ భైరవి మాత జుట్టు విరబోసుకుని, దుస్తులు లేకుండా రక్తం తాగుతూ మీ ముందుకొస్తే మీరేం చేస్తారని ప్రశ్నించింది. అప్పుడు భయపడే మీరు భక్తులుగా చెప్పుకోరా? అని ప్రశ్నించింది.. సాంప్రదాయాలు మాకు తెలుసు మతంపై మీకే సర్వాధికారాలు ఉన్నట్టు నటించవద్దని హితవు పలికిన కంగన.. జై శ్రీరామ్ అని ముగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -