Tuesday, May 21, 2024
- Advertisement -

గాలి వారి గాలి మాటలు !

- Advertisement -

వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిందే అని వారి పార్టీ అడుగుతోంటే.. గతంలో తెదేపా వారు కాంగ్రెస్లో చేరితే రాజీనామాలు అడగలేదే అంటూ ఆయన ప్రశ్నించారు గాలి ముద్దు కృష్ణమ నాయుడు.

ఇదొక ఎత్తు అనుకుంటే.. తెలంగాణలో తెదేపాకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు తెరాసలోచేరిపోయే మంత్రి పదవులు అనుభవిస్తోంటే వైకాపా ఎందుకు ప్రశ్నించలేదంటూ గాలి నిలదీస్తున్నారు. ఇదేం ట్విస్టు.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం గురించి నిలదీయడానికి వైకాపా ఏమైనా రాజకీయ నైతిక విలువలను ప్రచారం చేసే ధార్మిక సంస్థ కాదు కదా అని పలువురు గాలి మాటలను దెప్పిపొడుస్తున్నారు.

ఏ పార్టీ అయినా తమకు నష్టం జరిగినప్పుడు దాని మీద స్పందిస్తుంది. ప్రత్యర్థి పార్టీకి అదే తరహా నష్టం జరిగితే మౌనాన్నే ఆశ్రయిస్తుంది. అదే సమయంలో తెలంగాణలో తెదేపా వారు తెరాసలో చేరినప్పుడు తెదేపా పార్టీ మొత్తం వారి రాజీనామాల్ని అడిగింది కదా.. మరి అదే నైతిక విలువలను ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి మరచిపోయారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాలి వారి కామెడీ అంటే ఇలాగే ఉంటుంది మరి! 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -