Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కూడా ప్లాప్ అయ్యి తీరుతుంది

- Advertisement -

తరవాత సినిమా సూర్య తో కమిట్ అయినట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా చెబుతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయం లో ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇస్తున్న కళ్యాణ్ ఈ సినిమా విశేషాలు మీడియా తో పంచుకుంటూనే తదుపరి సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఒక ఫ్యాక్షన్ కథాంశం తో ఉంటుంది అన్నారు ఆయన.

పవన్ ఇలాంటి సబ్జెక్ట్ ని గతం లో చేసారు. ఫాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒచ్చే బంగారం సినిమా ప్రేమ కథ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. మళ్ళీ అలాంటి సినిమాని సూర్య తో చెయ్యడం కంటే ఖుషీ టూ తీయచ్చు కదా అంటున్నారు ఫాన్స్ కూడా. పవన్ కళ్యాణ్ లాంటి ఒక సూపర్ స్టార్ ఇప్పటికే బాలూ , పంజా సినిమాలు వేరు వేరుగా ఒకే కథ తో తీసాడు అనే బ్యాడ్ నేమ్ మూటగట్టుకున్నాడు అని టాక్ ఉంది.

ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమా అయితే ఎలా ? ఇప్పటికే సర్దార్ తో తీవ్రంగా నిరాశ చెందారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్ట్ ఆగితే బాగుండు లేదా మరొక ప్లాప్ కి సిద్దం అవుదాం అనుకుంటున్నారు ఫాన్స్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -