- Advertisement -
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోమారు వినిపించింది.
ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిచెప్పిన నేేతకు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఈ విషయంలో కేంద్రానికి పలుమార్లు విన్నవించారు.
తాజాగా తిరుపతిలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’ వేడుకల్లో రెండో రోజైన నేడు… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని వేడుకల ముగింపు తర్వాత టీడీపీ కేంద్రానికి పంపనుంది.