Tuesday, April 23, 2024
- Advertisement -

డ్ర‌గ్స్ ముఠాకు కూడా ప్ర‌త్యేక కోడ్ భాష‌..

- Advertisement -

ముఖ్యంగా చదువుకోవడానికి వస్తున్నాం.. అంటూ మన దేశంలోకి ప్రవేశిస్తున్న నైజీరియన్లు డ్రగ్స్ సరఫరాతో యువత పతనానికి కారణమవుతున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా వ్యభిచారాన్ని కూడా వీరు నిర్వహిస్తున్నారు. రాచకొండ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నైజీరియన్ల నుంచి వివిధ ఆసక్తికర వివరాలను పోలీసులు తెలుసుకున్నారు.
రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నైజీరియన్‌ నేరగాళ్ల దగ్గర దొరికిన డైరీలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయినైజీరియన్లు తమ డ్రగ్స్ కార్యకలాపాల నిర్వహణ క్రమంలో కోడ్‌(సంకేత) భాషను వినియోగించినట్లు తేలింది. డ్రగ్స్‌ విక్రయాలతోపాటు హైదరాబాద్‌లో ఉంటున్న నైజీరియన్‌ అమ్మాయిలతో వ్యభిచార దందాకు పాల్పడుతున్నారు.
న‌గ‌రంలో డ్ర‌గ్స్‌ను ఎవ‌రికికావాలో వారికి స‌ర‌ఫ‌రా చేసేంద‌కు కోడ్ భాష‌ను ఉప‌యేగించారు. ఇందులో సీవో అంటే కొకైన్‌ కావాలని అర్ధం. అలాగే బ్లాక్‌ బెర్రీ అంటే అమ్మాయి అని అర్థం. సీవో విత్ బ్లాక్ బెర్రీ అంటే డ్రగ్స్ తో పాటు అమ్మాయి కూడా కావాలని అర్థమని విచారణలో గుర్తించారు. వ్యభిచారాన్ని యాప్రాల్‌ కేంద్రంగా కుషాయి గూడ, ఏఎస్‌ రావు నగర్, జవహర్‌ నగర్, నేరేడ్‌ మెట్‌ లలో నిర్వహిస్తున్నారు.
నైజీరియన్ల ముఠా దగ్గర పోలీసులు కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌తోపాటు ఎంపిటమైన్‌ మాత్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపిటమైన్‌ మాత్రల్ని రేవ్‌పార్టీల్లో ఎక్కువగా వినియోగించేందుకు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు.దీంతో మ‌రింత లోతుగా విచార‌న చేయాల‌ని పోలీసులు నిర్న‌యించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -