Sunday, May 4, 2025
- Advertisement -

నోబెల్​ కమిటీ కీలక నిర్ణయం..!

- Advertisement -

నోబెల్​ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పురస్కార ప్రదానోత్సవాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా వర్చువల్​గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు నార్వే నోబెల్​ కమిటీ అధికారులు.

డిజిటల్​గా జరిగే ఈ వేడుకల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఓస్లేలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది నోబెల్​ కమిటీ.

నోబెల్​ బహుమతి ప్రదానోత్సవాన్ని నార్వే రాజధాని ఓస్లో లోని సిటీ హాల్​లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. అక్కడ ప్రస్తుతం మహమ్మారి ఉద్ధృతి కొనసాగతున్నందున తాజా నిర్ణయం తీసుకుంది నోబెల్​ కమిటీ. పురస్కార వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్​ నోబెల్​ వర్ధంతి సందర్భంగా.. ఏటా డిసెంబర్​ 10న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

భారత జలాలపై కొత్త ఆయుధాలు..!

అమెరికా జుట్టు చైనా చేతిలో..!

నకిలీ సైనికులు.. జర జాగ్రత్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -