Saturday, May 4, 2024
- Advertisement -

ఉత్త‌ర కొరియా దూకుడ‌కు చైనా,ర‌ష్యా లే కార‌నం .. మా జోలికి వ‌స్తే చూస్తూ ఊరుకోమ‌న్న అమెరికా

- Advertisement -
North korea poses us intel chief warns to china and russia

ఉత్త‌ర కొరియా ..అమెరికా మ‌ధ్య ఏ క్ష‌నంలో నైనా యుద్దం జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇన్నాల్లు మాట‌ల ద్వారా హెచ్చ‌రించిన అమెరికా ఇక చేతుల్లో చూపించేందుకు సిద్దంగా ఉంద‌నే స‌మాచారం అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు క‌ల‌వ‌ర పెడుతున్నాయి.

ఉత్త‌ర కొరియా ఇంతటి సాహసం చేయడానికి రష్యా, చైనాలే కారణమని అమెరికా గ్రహించింది. దీంతో ఏమాత్రం తొందరపడ్డా భారీ నష్టం చవిచూడాల్సి అమెరికా భావిస్తోంది.
దీనికి సంబంధించి అమెరికా యుద్ధ‌నైక‌లు,సైన్యం ఇప్ప‌టికే ద‌క్షిణి కొరియా,జపాన్ జ‌లాల్లో యుద్ధానికి రెడీగా ఉన్నాయి.పెద్ద‌న్న మాట‌ల‌ను లెక్క‌చేయ‌ని ఉత్త‌ర‌కొరియా తానేమి త‌క్కువేంకాద‌ని క‌య్యానికి సై అంటోది.కిమ్ జోంగ్‌ను ఖ‌టినంగా అనిచివేస్తామ‌ని హెచ్చ‌రిస్తుంటే…మీకు అంత ద‌మ్ముందా అంటూ కొరియా స‌వాల్ విసురుతోంది.అమెరికా హెచ్చరికలకు ఏమాత్రం వెరవకుండా ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడంతో ట్రంప్ ఆలోచనలు, వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ఉత్త‌ర కొరియా దుస్స‌హ‌సానికి ఒడి గ‌ట్ట‌డానికి ర‌ష్యా,చైనాలే కార‌న‌మ‌ని అమెరికా భావిస్తోంది.ఒక వేల యుద్ధం జ‌రిగితే అమెరికా ఉప‌గ్ర‌హ వ్య‌వ‌స్త‌ను నాశ‌నం నాశ‌నం చేయ‌డానికి చైనా,ర‌ష్యాలు కుట్ట‌ప‌న్నాయ‌ని ఇంట‌లిజెన్సీ న‌వేది చెబుతోంది.యుద్ధం అనివార్యమయితే మాత్రం ఆ రెండు దేశాలు తమ ఉపగ్రహ వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
రష్యా, చైనాలకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ డేనియల్ కోట్స్ హెచ్చరించారు. ఈ రెండు దేశాలు ఏకమైనా తమ ఉపగ్రహ వ్యవస్థను ఏమీ చేయలేవని అన్నారు. ఉపరితలం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే అత్యాధునిక ఆయుధాలు తమ దగ్గరున్నాయని ఆయన పేర్కొన్నాడు. అత్య‌వ‌స‌రంలో త‌ప్ప వాటిని ఎప్పుడు ప‌డితే అప్పుడు ఉప‌యేగించ‌మ‌ని తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 2}

చైనా, రష్యాలు తమ ఉపగ్రహ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తే, వాటిపై దాడి చేయడానికి నిమిషం కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. అంతే కాదు అమెరికాతో సరితూగే ఉపగ్రహ వ్యవస్థను రూపొందించడానికి ఆ రెండు దేశాలకు ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -