- Advertisement -
పవన్ చెప్పినట్లుగానే రాజధాని భూముల రైతులను కలవడానికి గుంటూరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన పవన్‌కు రైతులు తమ గోడు చెప్పుకున్నారు.
మీరు చెబితేనే టిడిపికి ఓటు వేశామని కాని ఇప్పుడు ఈ ప్రభుత్వం మమ్మల్ని వేదిస్తోందని రైతులు వాపోయారు. మా భూములు మూడు పంటలు పండుతాయి. అలాంటి భూములు రాజధాని కోసం ప్రభుత్వం ఎలా ఇవ్వమని అడుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతుల నుంచి సమస్యలు వింటున్న పవన్‌కి ఒక చేదు అనుభవం ఎదురైంది.
ఎవరో ఆగంతకుడు పవన్‌పై రాయి విసిరాడు. పవన్‌కు తగల్లేదు కానీ తనకు దగ్గరగా వచ్చి పడింది. కింద పడిన రాయిని పవన్ చేతిలోకి తీసుకొని పరిశీలన చేస్తూ ప్రజలు చెపుతున్న సమస్యలు వింటూనే మీకు నేను అండగా ఉంటాను. ఎక్కడికి పారిపోను అని రైతులకు ధైర్యం చెప్పారట. ఆ తర్వాత పోలీసులు వచ్చి పవన్‌కు సెక్యూరిటిని అందించారు.