Saturday, April 27, 2024
- Advertisement -

అదే జరిగితే టీడీపీకి కోలుకోలేని దేబ్బే?

- Advertisement -

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం జనసేన అత్యంత వేగంగా బలపడుతోంది. ప్రస్తుతం జనసేన జోరు చూస్తుంటే వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీనే అనే భావన రాకమానదు. దాంతో ఇతర పార్టీల నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలోని కొందరు నేతలు జనసేన పార్టీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నార్త్ జోన్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు గంటా శ్రీనివాస్.

మొదటి నుంచి టీడీపీలో కీలక నేతగా ఉంటున్న ఆయన చంద్రబాబు గత హయాంలో మానవ వనరుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇక 2019 వెన్నికల్లో విశాఖ నార్త్ జోన్ లో టీడీపీ తరుపున విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో ఆయన పార్టీతో అంటి అంతనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ మద్య వైసీపీలో చేరేందుకు కూడా గంటా ప్రయత్నించినట్లు వార్తలు వినిపించినప్పటికి.. ఆయన చేరికపై విజయసాయి రెడ్డి అభ్యంతరం తెలిపినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశారు కూడా. అయితే స్పీకర్ నుంచి ఇంతవరకు ఆమోదం పొందలేదు.

దాంతో అటు పార్టీ కార్యక్రమాలకు అలాగే ఇటు పదవి బాద్యతలకు దూరంగా ఉంటున్న గంటా.. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ జీవితం కోసం జనసేనలో కలిసే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి. దానికి కారణం కూడా లేకపోలేదు. మొదటి నుంచి కూడా గంటా శ్రీనివాసరావు కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా పోటీ చేశారు. అయితే ఆ తరువాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ చేరారు. ఆ తరువాత కొన్నాళ్ళకు కాంగ్రెస్ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక టీడీపీ తరుపున 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి, 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ జోన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ జనసేనలోనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న గంటా జనసేన తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యం లేదు.

ఇవి కూడా చదవండి

వైసీపీకి భవిష్యత్ ప్రత్యర్థి బీజేపేనట..మరి జనసేన?

ఏపీలో సింపతీ రాజకీయాలు..ప్రజా మద్దతు ఎవరికి?

కొత్త వారికి నో ఛాన్స్.. కే‌సి‌ఆర్ వ్యూహం ఫలిస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -