Friday, April 19, 2024
- Advertisement -

ఏం మాట్లాడతాడో.. ఒంటిగంటకు పవన్ ప్రెస్ మీట్..!

- Advertisement -

పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వస్తున్నాడు! ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నాడు. జనసేన అధినేత హోదాలో పవన్ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు పవన్ స్పందన ఎలా ఉండబోతోంది..

ఏయే అంశాల గురించి ఆయన మాట్లాడతాడు.. అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల ముందు రాజకీయ తెరపైకి వచ్చిన పవన్ తన తీరుతో రాజకీయంగా ప్రాధాన్యతను సంపాదించుకొన్నాడు.

 

ఎన్నికల ముందు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతు పలకడం అయితేనేమీ.. ఆ పార్టీలు అధికారంలోకి రావడంతోనైతేనేమీ.. ఆ పార్టీలు హామీలు నెరవేర్చడంలో విఫలం కావడం… వారిని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అనే విమర్శలు రావడం జరిగింది! ఇలాంటి నేపథ్యంలోనే ఓటుకు నోటు స్కామ్ కూడా తెరపైకి వచ్చింది. వివిధ అంశాల గురించి అప్పుడప్పుడు ట్వీట్లు పెట్టడం తప్ప పవన్ చేస్తున్నది ఏమీ లేదు!

 ఇలాంటి నేపథ్యంలో పవన్ ప్రశ్నించడానికి రావడం లేదు..అ నే విమర్శలు తీవ్రంగానే ఉన్నాయి. పవన్ మార్కు రాజకీయాలు ఎవరికీ అంతుబట్టడం లేదనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ తను ఎప్పుడు స్పందిస్తాననే అంశం గురించి కూడా ఇటీవలే ట్వీట్ పెట్టాడు. ఆ ముహూర్తం రానే వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం పవన్ మీడియాతో మాట్లాడనున్నాడు. మరి ఆయన ఏం మాట్లాడతాడో.. ఎలా స్పందిస్తాడో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -