Saturday, May 10, 2025
- Advertisement -

టీడీపీ కుట్ర బట్ట బయలు..!

- Advertisement -

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలు అయింది. హైకోర్టు సాక్షిగా దొరికి పోయారు డీజీపీ, పల్నాడు పోలీసులు. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడైంది. పోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయం వ్యక్తం కాగా పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు వాయిదా వేసింది.

మరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగారు లాయర్ అశ్వనీ కుమార్. ఇవాళ టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది పోలీసులు తీరు. పిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్నారు డీజీపీ, పల్నాడు పోలీసులు. పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చ జరుగుతోంది.

ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట కలిగించగా జూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పింది హైకోర్టు.హత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేశారు పోలీసులు.వాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేశారు పోలీసులు. కానీ ఇవ్వాళ్టి హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పారు పోలీసులు.

పోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా ఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరం వెంటనే రికార్డులు పరిశీలించింది హైకోర్టు. పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడించింది. ఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడైంది. వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదని పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -