Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబు అంటేనే మోసం?

- Advertisement -

మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు అంటేనే 420 హామీలు, మోసం. తన పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్దపు హామీలు ఇవ్వడానికైనా వెనుకాడరు చంద్రబాబు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బాబు ఇస్తున్న హామీలను చూస్తే ప్రజల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమవుఓంది.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసివుంటే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎందుకు చెప్పుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో.. అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి ఉంటే ఎందుకు చెప్పుకోరు?,ఇప్పుడు అలవికాని హామీలు ఇస్తున్న చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్ముతారా? అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ఉచితాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా అప్పులపాలవుతుందని విమర్శించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఎన్నికలు రాగానే లెక్కలేనన్ని ఉచితాలు ప్రకటించడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పెన్షన్ కేవలం రూ.వెయ్యి మాత్రమే..ఆ తర్వాత ఎన్నికలకు ముందు రూ. 2వేలు చేసి ఇప్పుడు ఏకంగా నాలుగు వేలు ఇస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మొన్నటి వరకు వాలంటీర్లంటే గోనె సంచులు మోసేవారని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు వెళ్లి మహిళలను వేధిస్తార‌ని తప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు.. ఎన్నికల వేళ వారిని మచ్చిక చేసుకునే కొత్త నాటకానికి తెరతీశాడు. అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌ను కొన‌సాగిస్తాన‌ని, వారి వేత‌నం రూ.10వేలకు పెంచుతాన‌ని తెలిపారు. అయితే బాబు ఇచ్చే హామీలను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -