Saturday, May 18, 2024
- Advertisement -

లీటర్‌కు 2.50పై తగ్గనున్న పెట్రోల్?

- Advertisement -

పెట్రోల్‌ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఏకంగా రెండున్నర రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్‌ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 105 డాలర్లు కూడా దిగి 104 డాలర్లకు సమీపంలోకి వచ్చింది. ఈ కారణంగా ఆయిల్‌ కంపెనీలకు పెట్రోల్‌ మీద ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. ఈ లాభాల్ని  చాలా వరకు వినియోగదారులకే అందించాలని ఆయిల్‌ కంపెనీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెట్రోల్‌ ధరను భారీగా తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. పైగా అదే రోజు ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలు కూడా తమ వంతుగా పెట్రోల్‌ ధరను రెండున్నర రూపాయలు  తగ్గించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -