దేశంలో పులల సంఖ్య పెరగడంపై ప్రధాని మోది సంతోషం వ్యక్తం చేశారు. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘ఆల్ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2018’ నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ..2014లో దేశవ్యాప్తంగా 2,266 పులులు ఉండేవని చెప్పారు. కానీ 2018 నాటికి ఈ సంఖ్య 2,967కు పెరిగిందన్నారు. గత నాలుగేళ్లతో పోలీస్తే.. దేశంలో పులుల సంఖ్య 700 పెరిందన్నారు. ప్రతి ఏటా జులై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. 2022 నాటికి దేశంలో పులుల సంతతిని రెట్టింపు చేయాలని 9 సంవత్సరాల క్రితం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
దేశంలో క్రమంగా పులుల జనాభా పెరిగిపోతోంది. 2006లో 1,411, 2010లో 1,726, 2014లో 2,226 పులులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2,967కు చేరుకుంది. పులుల పెరుగుదలకు భారత్ అనువైన ప్రాంతమన్నారు. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పులుల సంరక్షణా కేంద్రాల సంఖ్య 692 నుంచి 860కి పెరిగిందన్నారు. కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలు 43 నుంచి 100ను దాటాయన్నారు. 2022 కల్లా పులుల సంఖ్యను రెట్టింపు చెయ్యాలని 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్ని చర్యలు చేపట్టాయి.