చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఊదరగొడుతూ ఉండే పోలవరం ప్రాజెక్ట్ పని ఆగిపోయింది. అధికారులు, ప్రభుత్వం కలిసి దీన్ని నట్టేట ముంచేశారు, మూడు నెలలుగా జీతాలు లేక కార్మికులు అల్లాడిపోతున్నారు. చివరికి పని ఆపేసే పరిస్థితి కి వచ్చింది వారికి. ప్రభుత్వం ఇప్పటికీ మేలుకోక నిద్రపోతూ ఉండడం తో పనులు అన్నీ ఎక్కడికక్కడే ఆపేశారు.
మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పశ్చిమగోదావరి లో జరుగుతున్న పోఅల్వరం పనుల్లో గొడ్డు చాకిరీ చేయించారు అని చెబుతున్నారు కార్మికులు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్టు ఏజన్సీలో పనిచేస్తున్న పొక్లయినర్లు – డంపర్ల డ్రైవర్లతోపాటు సూపర్ వైజర్లు – సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో సమ్మెకు దిగారు.
దీనితో ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన స్పిల్ వే ప్రాంతంలో రోజుకు 25వేల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీస్తున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పనులు నిలిచిపోయాయి.