Friday, May 9, 2025
- Advertisement -

బావా బావా అంటూనే హ‌త్య‌కు స‌హ‌క‌రించిన బంధువులు..

- Advertisement -

పది రోజుల క్రితం అరకు సమీపంలోని లివిటిపుట్టు వద్ద జరిగిన కిడారి సోమేశ్వరరావు, సివేరి సోమల జంట హత్యలకేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది.ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను మావోయిస్టులు హత్య చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో తవ్వేకొద్దీ నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఓ వ్యక్తి కిడారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూనే ఆయనను హతమార్చడానికి మావోయిస్టులకు సహకరించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అతడిచ్చిన సమాచారంతోనే మావోయిస్టుల వ్యూహం సఫలమైనట్టు గుర్తించారు. తమ వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని డీజీపీ ఠాగూర్ ప్రకటించారు. నమ్మించి గొంతుకోసిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి.

సివేరి సోమకు దగ్గరి బంధువు సుబ్బారావును అరెస్ట్ చేసి విచారించగా, ఆయన నేరం ఒప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మావోయిస్టులు తనను కలిసి కిడారిని, సోమలను ఒకేసారి అప్పగించకుంటే చంపేస్తామని బెదిరించారని, దీంతో భయపడి, ఏం చేయాలో పాలుపోకనే, వారిరువురూ కలసి ఓ కార్యక్రమానికి వెళుతున్నారన్న సమాచారాన్ని మావోలకు పంపానని సుబ్బారావు అంగీకరించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

సోమకు దగ్గరి బంధువు అయిన సుబ్బారావు, కిడారికి ప్రధాన అనుచరుడు కూడా. దీంతో వారిద్దరి కదలికలపై సుబ్బారావుకు అన్నీ తెలుస్తుంటాయన్న ఆలోచనతోనే, పక్కా ప్లాన్ తో మావోలు ఆయన్ను ట్రాప్ చేశారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

విచారణలో భాగంగా సుబ్బారావు కాల్ డేటాను బయటకు తీసిన పోలీసులు, అతనితో మావోయిస్టులు టచ్ లో ఉన్నారని గుర్తించి, రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. తాను మావోలతో పలుమార్లు మాట్లాడిన మాట నిజమేనని, ప్రాణం పోతుందన్న భయంతోనే ఈ పని చేశానని, కారులో రూ. 3 కోట్లు ఉన్నాయన్న విషయం తనకు తెలియదని సుబ్బారావు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం.

ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటూనే ఆయన అనుపానులు మావోయిస్టులకు చేరవేసినట్లుగా తెలుస్తోంది. కిడారి హత్యకు ముందు.. ఆ తర్వాత ఒక బంధువు కాల్ డేటాను విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతను ఓ మండల స్థాయి నాయకుడని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -