Tuesday, May 6, 2025
- Advertisement -

జేసీకీ పోలీస్ ప‌వ‌ర్ రుచి చూపించారుగా…

- Advertisement -

అధికారంలో ఉన్న పార్టీకే పోలీసులు ఎక్క‌డైనా ఫేవ‌ర్‌గా ఉంటార‌నేది అంద‌రికీ తెలిసిందే. అవ‌కాశం దొరికితే ప్ర‌తిప‌క్షాల మీద కేసులు పెట్టి వారిని వేధింపుల‌కు గురి చేసి అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో ఉంటారు. అధికార పార్టీ న‌తేలు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డినా, అవ‌మానాల‌కు గురి చేసినా భ‌రిస్తున్న పోలీసులు స‌హ‌నం కోల్పోయి రివ‌ర్స్ అయితే ఎలా ఉంటాదో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి చూపించారు.

ప్ర‌భోధానంద ఆశ్ర‌మ వివాదంలో పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసులు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు.

తమ ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తే సహించేది లేదని పోలీసు అధికారులు మండిపడ్డారు. తలతిక్కగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. రాజకీయ నాయకులకు కొమ్ము కాయడానికి పోలీసు వృత్తిలోకి రాలేదన్నారు. దివాకర్‌రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలని సీఐ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాము మగాళ్లమయ్యే ఉద్యోగాలు చేస్తున్నామని శిఖండి కాదన్నారు. పోలీసులే కాదు పొలిటికల్ లీడర్లు ఫెయిల్ కారా అని ప్రశ్నించారు.

కూలింగ్‌లో ఉన్న‌వారు, రూలింగ్‌లో లేని వారు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని సీరియస్ గా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జేసీ అసభ్యకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని గోరంట్ల మాధవ్‌, త్రిలోక్‌నాథ్‌, సూరీ డిమాండ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -