మళ్లీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

- Advertisement -

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు రాయలసీమలోని మూడు జిల్లాలతో పాటు తీరప్రాంత జిల్లా అయ్యిన నెల్లూరుపై కూడా ప్రభావం పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడప, చిత్తూరు జిల్లాల్లో కుంబ వృష్టి నమోదైంది. వానలకు తిరుపతి నగరమంతా జలదిగ్భందంలో చిక్కుకుంది. తిరుమల క్షేత్రం నుంచి తిరుపతి నగరానికి జలపాతంలా, సెలేరుల్లా వరద బీభత్సం సృష్టించింది. గత 40 ఏళ్లుగా ఎన్నడూ నిండని రాయల చెరువు నిండి భారీగా వరద ప్రవాహం కొనసాగింది. దీంతో చుట్టుపక్కల ఉన్న సుమారు వందలాది గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.

ఈ వరదల వల్ల కడప జిల్లాలోని శివాలయం వద్ద ఉన్న భక్తులు జల సమాదయ్యారు. అలాంటి వరద.. నెత్తుటేరిన కడప జిల్లాల్లో వచ్చింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు బ్రిడ్జిలు కుప్ప కూలాయి. రహదారులు ధ్వంసం మయ్యాయి. గ్రామాలు, నగరాలు నీటిలో నానాయి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు నెలకొరిగాయి.

- Advertisement -

వరదల నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నామనుకుంటున్న ఏపీ ప్రజలకు మరో షాక్ తగలనుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపై పెను ప్రభావం పడనుంది. ఈ నెల 27 నుంచి ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ముందస్తు చర్యలు ఏమైనా చేపట్టనుందా.. వర్షాల సమయంలో పునరావాస కేంద్రాల్లో ఉండటం అలవాటు చేసుకున్న ఏపీ ప్రజలను ఇలానే వదిలేస్తుందా లేక వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుందా అనేది చూడాలి.

చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

సినిమా హిట్టే .. కలెక్షన్ నిల్..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -