Sunday, May 12, 2024
- Advertisement -

భ‌ర‌త్ మ‌ద్యంసేవించిన‌ట్లు బ‌య‌టకు వ‌చ్చిన‌ సీసీలో రికార్డ‌యిన దృష్యాలు..

- Advertisement -
Police probe on Ravi teja brother Bharath raju accident mystery

హీరో ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు చర్చలోకి వస్తున్నాయి.అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భరత్ మద్యం మత్తులో డ్రైవింగ్‌లోకి జారుకున్నారాలేకా నిద్ర‌లోకి జారుకోవ‌డంవ‌ల్ల జ‌రిగిందా అన్న అనుమానాలు అంద‌ర్నీ అయేమ‌యానికి గురి చేస్తున్నాయి.

మద్యం సేవించడం, అతి వేగంగా కారు నడపడంతోనే భరత్ కారు ప్రమాదానికి గురైనట్టు పోలీసులు పేర్కొనడం విదితమే. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ప్రమాదానికి ముందు భరత్, నోవాటెల్ హోటల్ లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ‘నోవాటెల్’లో శనివారం జరిగిన తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి భరత్ హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డయింది.

{loadmodule mod_custom,GA1}

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆ హోటల్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత తన స్కోడా కారులో బయటకు వచ్చిన భరత్, రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఆయన కారు 145 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}GRJ9W49lDlY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -