Friday, May 10, 2024
- Advertisement -

ర‌వితేజ తీరు పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు…

- Advertisement -
Ravi Teja not attend brother’s funeral… But attended Shooting

మాస్ మహారాజ్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో రవితేజ.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలకోర్చి ఎదిగిన అనంత‌రం స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు.

తన దైన నటన, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని, అభిమానులను సొంతం చేసుకున్న రవితేజపై నిన్నటి వరకూ ఎటువంటి విమర్శలూ లేవు.వివాదాల‌కు దూరంగా ఉంటాడు. కానీ, కారు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు భరత్ రాజు అంత్యక్రియలకు రవితేజ హాజరుకాకపోవడంపై మాత్రం విమర్శలు గుప్పుమంటున్నాయి.

{loadmodule mod_custom,GA1}

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో భరత్ అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఈ అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ, తన చిత్రం షూటింగ్ కు మాత్రం ఈ రోజు వెళ్లాడు. దీనిపై, ఆయన అభిమానులు, నెటిజన్లు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాలేదు కానీ.. మరుసటి రోజే షూటింగ్ కు మాత్రం వెళ్లాడని విమర్శిస్తున్నారు.
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘రాజా ది గ్రేట్’ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. తమ్ముడి మరణంతో బాధగా ఉన్న రవితేజ, షూటింగ్ కు రారని దర్శకుడు భావించి, వాయిదా వేయాలని అనుకున్నారట. అయితే, దర్శకుడు ఊహించిన దానికి భిన్నంగా తాను షూటింగ్ కు వస్తున్నానని రవితేజ ఫోన్ చేసి చెప్పారట. దీంతో ఆయ‌న అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}5b6HNn8oIbA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -