Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్, ఎన్టీఆర్ లతో కాలేదు.. మహేశ్ ఆమెకు లైఫిస్తాడా?!

- Advertisement -

ఇప్పటికే పవర్ స్టార్ తో ఒక సినిమా చేసేసింది ప్రణీత. దాదాపు ఆరేళ్ల కిందటే తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ భామ దశ “అత్తారింటికి దారేదీ” అవకాశంతోనే తిరిగిపోతుందని అందరూ అనుకొన్నారు. పవన్ తో సినిమా చేస్తే తిరుగులేని స్థాయికి చేరుకొంటుందనుకొన్నారు. అయితే అది జరగలేదు. ఈ హీరోయిన్ కు అనుకొన్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కన ఆమెకు అవకాశం వచ్చింది. “రభస”లో కూడా ఆమె సెకెండ్ హీరోయిన్ గానే చేయాల్సి వచ్చింది. ఇక ఆసినిమా హిట్ కూడా లేదు. హిట్టైన అత్తారింటికిదారేదీ సినిమాతోనే ప్రణీత దశ తిరగలేదు. ఇక హిట్ కాని ‘రభస’ ఆమను ఏ విధంగానూ ఉద్ధరిస్తుంది?!

ఇక ఆ సంగతులు అలా ఉంటే.. ఇప్పుడు ప్రణీతకు మరో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఈసారి మహేశ్ బాబు సరసన. పవన్, ఎన్టీఆర్ ల పక్కన రెండో ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ గా చేసిన ఆమె ‘బ్రహ్మోత్సవం”లో కూడా సెకెండ్ హీరోయిన్ గా చేయబోతోంది. ఈ సారి ప్రథమ ప్రాధాన్యత ఉన్న పాత్రలో రకుల్ చేయబోతుండగా.. ద్వితీయ ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ గా ప్రణీత చేయబోతోంది. మరి ఈ సారి అయిన ఆమెకు స్థాయి పెరుగుతుందేమో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -