- Advertisement -

రేపు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ధర్నా

- Advertisement -

రేపు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజక వర్గాల్లో ధర్నా నిర్వహించడానికి సిద్దం అవుతోంది. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 175 నియోజకవర్గాల్లో ధర్నా, నిరసనలు చేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్.వి మైసూరా రెడ్డి మీడియాకు తెలిపారు.

దమ్ముంటే నిజాయితీ నిరూపించుకోవాలని, ఆ వాయిస్ చంద్రబాబుది కాకపోతే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహించి చంద్రబాబు రాజీనామా చేయాలి. లేకపోతే సిబిఐ విచారణ జరిపించి నిర్దోషిగా నిరూపించుకోవాలి. ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్రాల సమస్య కాదు, వ్యక్తిగత సమస్యే అని ఆయన మీడియాకు తెలిపారు.

ఏపి వ్యాప్తంగా రేఫు ఉదయం 11 గంటలకు అన్ని నియోజక వర్గాల్లో ధర్నాలు, నిరసనలు జరుగుతాయని, మా పార్టీ నేతలు, అధ్యక్షులు జగన్‌మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతిని కలనున్నామని ఆయన తెలిపారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -