- Advertisement -

ఇండియా లో పబ్ జీ ఆడాలనుకునే వారికి గుడ్ న్యూస్..?

- Advertisement -

ఇండియా చైనా ఉద్రిక్తలమధ్య భారతదేశ ప్రభుత్వం ఇండియా లో చైనా యాప్స్ ని నిషేధించిన విషయం అందరికి తెలిసిందే.. అందులో టిక్ టాక్ తో సహా చాలా చైనా యాప్ లు బలి అయిపోయాయి.. ఇక రెండో దశ నిషేధంలో పబ్ జీ సైతం బ్యాన్ చేసింది.. దాంతో పబ్ జీ లవర్స్ తలలు పట్టుకున్నారు.. గేమ్ ఆడుతూ దానికి బానిస అయినవారి అయితే మాత్రం దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట.. భారతదేశంలో 50 మిలియన్‌ మందికి పైగా పబ్జీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేశారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. తాజాగా పబ్ జీ మొబైల్ బ్యాన్ చేయడంతో గేమర్లకు దిగులు పట్టుకుంది. వీడియో గేమ్ లలోనే ఓ ప్రభంజనం సృష్టించిన ఈ పబ్ జీ ని మళ్ళీ ఇండియా లోకి తీసుకొచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సీరియస్ గ ఉందట.. ఇక పబ్ జీ లవర్స్ కి ఓ గుడ్ న్యూస్ ని రిలీజ్ చేసింది ప్రభుత్వం..

పబ్ జీ లో కేవలం పబ్ జీ మొబైల్, పబ్ జీ లైట్ వెర్షన్స్ ని మాత్రమే బ్యాన్ చేశాము పబ్ జీ పేరెంట్ గేమ్ అయినా పబ్ జీ ని ఇంకా బ్యాన్ చేయలేదు.. పేరంట్ గేమ్ PUBG సర్వర్ గేమర్ లకు ప్రభుత్వం అనుమతించింది. ఈ పబ్ జీ సర్వర్లకు ఎలాంటి చైనీస్ కనెక్షన్లు లేవు. ఇందులో PUBG Corp నిర్వహించే సర్వర్లతో రన్ అవుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ PUBG గేమర్లను ఇండియాలో ఆడుకునేందుకు అనుమతిస్తుంది. అయితే మొబైల్ ఫోన్లలో పనిచేయదు.. టాబ్లెట్లలో కూడా ఆడలేరు.. కేవలం కంప్యూటర్లలో మాత్రం PUBG వీడియో గేమ్ ఆడగలరు.. ల్యాప్ టాప్ లలో కూడా వినియోగించుకోవచ్చు.

గేమ్ PCలో మరింత ఆకట్టుకునేలా గ్రాఫిక్స్ అందిస్తోంది. కంప్యూటర్ (PC) కోసం PUBG Lite వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వాస్తవానికి పబ్ జీని తయారు చేసింది కూడా దక్షిణ కొరియానే.. ఆ తర్వాత సౌత్‌ కొరియా నుంచి లైసెన్స్‌ పొందిన చైనా కంపెనీ Tencent పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది.చైనా యాప్ టిక్‌టాక్‌ మాదిరిగానే PUBG యాప్ కూడా గూగుల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. కేంద్రం ఆదేశాలు అందగానే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆ యాప్‌ను తొలగిస్తారు. ఒకవేళ ఇదివరకే ఈ PUBG యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఉంటే మాత్రం.. Airtel, Jio మిగత నెట్‌ వర్క్‌లు తమ సర్వర్ల నుంచి PUBG IP అడ్రస్‌ను తొలగించాయి.. దాంతో పబ్ జీ వీడియో గేమ్‌ ఇకపై ఆడలేరు. కానీ, కంప్యూటర్, పీసీ వెర్షన్ పబ్‌జీ యాప్ మాత్రం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఆడుకోవచ్చు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -