కళాశాలల్లో ఫేరవెల్ పార్టీల పేరుతో విద్యార్థులు డ్యాన్సులు వేయడం సాధారనం. కాని పాకిస్థాన్ పరిధిలోని పంజాబ్ ఫ్రావిన్స్ ప్రభుత్వం మాత్రం ఖటిన చర్యలు తీసుకుంది. ఇకపై విద్యార్థులతో బలవంతంగా నృత్యాలు చేయించే పాఠశాలల లైసెన్సులను రద్దుచేస్తామని స్పష్టం చేసింది.
పాఠశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో నృత్యాలను నిషేధించినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక కథనం పేర్కొంది. స్కూళ్లలో డాన్సులు చేయడం మతవిలువలకు, సూత్రాలకు, సిద్ధాంతాలకు విరుద్ధం. విద్యార్థుల చేత బలవంతంగా డాన్సులు చేయించడం లేదా అలాంటి అనైతిక కార్యక్రమాల్లో వారు పాల్గొనేలా చేసే స్కూళ్ల లైసెన్సులు రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఓ నోటీసు జారీ చేసింది. డాన్సులపై విధించిన నిషేధాజ్ఞలను టీచర్లు, విద్యాసంస్థల అధిపతులు సహా పాటించని వారిపై తగు చర్యలు తీసుకుంటారు.
పోటీలు, తల్లిదండ్రుల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం చివరకు వక్తృత్వ పోటీల సందర్భంగా కూడా విద్యార్థులు పాకిస్తానీ, భారతదేశ సినిమా పాటలకు డాన్సులు చేయడం ఆనవాయతీగా వస్తోందని ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం, సందర్భంతో పనిలేకుండా పాఠశాలల్లో డాన్సులు చేయడం నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలు పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండింటికీ వర్తిస్తాయి. నిషేధం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రావిన్స్ సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.