Monday, May 12, 2025
- Advertisement -

మ‌రో ఆరు సంత్స‌రాల‌పాటు ర‌ష్యాఅధ్య‌క్షుడిగా కొన‌సాగ‌నున్న పుతిన్‌….

- Advertisement -

రష్యా అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. గత 18 ఏళ్లుగా అధ్యక్ష పీఠంపై ఉన్న ఆయన్నే మళ్లీ ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పటివరకు 70 శాతం ఓట్లు లెక్కించగా, ఇందులో పుతిన్‌కు 75.9 ఓట్లు సాధించినట్టు సెంట్రల్ ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో వరుసగా ఆయన నాలుగోసారి గెలిచి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.

ఈ విజయంతో మరో ఆరేళ్లపాటు అంటే 2024 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు. గతంలో సోవియట్ యూనియన్ నియంత జోసెఫ్ స్టాలిన్ మాత్రమే అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. మొత్తం 10.70 కోట్ల మంది ఓటర్లలో మెజారిటీ ప్రజలు మళ్లీ ఆయన్నే కోరుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌తోపాటు ఏడుగురు పోటీపడగా, న్యాయపరమైన కారణాలతో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ ముందే తప్పుకున్న విషయం తెలిసిందే.

వ్లాదిమిర్‌ పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది నాల్గోసారి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్‌ రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో గెలుపోందటంతో 2024 వరకూ కొనసాగనుంది. 2012 వరకూ రష్యాలో అధ్యక్షుడి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. కానీ 2012లో పుతిన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించారు.

పుతిన్ పశ్చిమ దేశాలకు ధీటుగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని, ప్రజల జీవనప్రమాణాలను పెంచడానికి కృషిచేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. ఈ విజయంపై పుతిన్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో తనపై విశ్వాసం ఉంచి ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -