Monday, May 20, 2024
- Advertisement -

లైంగిక సామ‌ర్థ్యం పెంచుకోవ‌డంకోసం… ఆ దేశాధ్య‌క్షుడు..

- Advertisement -

రష్యాలో దుప్పి(రాయల్ స్టాగ్) రక్తానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. 100డాలర్లు వెచ్చిస్తే గానీ 10మి.లీ దుప్పి రక్తం దొరకదంటే.. దాని డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పి రక్తంతో స్నానం చేయడం వల్ల శారీరక వ్యాధులు నయం అవుతాయన్న రష్యన్ల నమ్మకమే దీనికింత డిమాండ్ పెరిగేలా చేసింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురించి ఆ దేశ మీడియా షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. పుతిన్‌ లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి రాయల్‌స్టాగ్‌ (దుప్పి) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారట. ఈ విషయాన్ని ఓ రష్యన్‌ టెలివిజన్‌ ఛానల్‌ పేర్కొంది.

అంతేకాదు పుతిన్‌ స్నానం చేయడానికి గతేడాది 70 కిలోల దుప్పి కొమ్ములు సేకరించినట్లు మీడియా ఆరోపించింది. రాయల్‌ స్టాగ్‌ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో చాలా రకాల శారీరక సమస్యలు నయమవుతాయని అక్కడి వారి నమ్మకం. రష్యాలో ఈ రక్తంతో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. కేవలం పది మిల్లీలీటర్ల రక్తమే వంద డాలర్లు విలువచేస్తుంది. ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తే మరికొందరు దీన్ని సేవిస్తుంటారని రష్యన్‌ మీడియా పేర్కొంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -