Thursday, May 8, 2025
- Advertisement -

రాహుల్ బీజేపీకి మరీ ఇంత ఛాన్స్ ఇచ్చాడేంటీ!

- Advertisement -

మరి రాహుల్ ఎక్కడున్నాడో.. ఆయన ఏమనుకొంటున్నాడో కానీ. .నిజమైన కాంగ్రెస్ అభిమానులకు కూడా ఇప్పుడు ఆయనపై కోపం పెల్లుబుకుతోంది. ఇంత బాధ్యతారహిత్యం అయితే ఎలా..

అని వారు బాధపడుతున్నారు. అధికార పక్షంపై పోరాడాల్సింది పోయి.. ఇలా అధికార పక్షానికి అస్త్రాలు అందిస్తే ఎలా? అంటూ వారు వాపోతున్నారు! ఒకవైపు నరేంద్రమోడీ ప్రభుత్వం హనీమూన్ పిరియడ్ ను ముగించుకొంది. తన చర్యలతో ప్రజా వ్యతిరేకతను సంపాదించుకొంటోంది. రాజ్యసభలో ఆ పార్టీకి బలం లేదు.. ‘భూ సేకరణ చట్టం సవరణలు’ వంటి బిల్లు విషయంలో కమలం పార్టీని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టే సువర్ణావకాశం ఉంది.

కమ్యూనిస్టు పార్టీలు.. రాజ్యసభలో అంతో ఇంతో బలం ఉన్న ఇతర పార్టీలను కలుపుకొని పోతే మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టవచ్చు. అయితే రాహుల్ కు ఇవేమీ పట్టినట్టుగా లేవు. అసలు ఆయన ఎక్కడున్నాడు.. అనేదే అంతుబట్టని అంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఊసురుమంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నో  రాహుల్ తీరుతో నిస్పృహకు లోనవుతున్న పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. వృద్ధాప్యంతో సహజంగానే వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇప్పుడు ధర్నాలకు , రాస్తారోకోలకు రెడీ అవుతోంది. 

వచ్చే నెల ప్రారంభంలో భారీ స్థాయిలో ధర్నాను నిర్వహించడానికి ఆమె సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో సోనియాగాంధీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. మోడీ ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ సోనియాగాంధీ ఈ ధర్నాకు దిగుతున్నారని తెలుస్తోంది. ఇది వరకూ మన్మోహన్ కు సంఘీభావ యాత్రకు సోనియా నేతృత్వం వహించింది. రామ్ లీలా చేపట్టే ఈ నిరసన పోరాటం ద్వారా అటు మోడీ వైరి పక్షాలన్నింటినీ ఒక తాటి మీదకు తీసుకురావడం.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయనున్నారట సోనియాగాంధీ. వాస్తవంగా చెప్పాలంటే ఇది రాహుల్ చేయాల్సిన పని. ఇప్పటి నుంచి పోరాటాలు మొదలుపెడితే వచ్చే ఎన్నికల సమయానికి రాహుల్ పార్టీకి అంతో ఇంతో జవసత్వాన్ని చేకూర్చగలడు. అయితే ఆయనకు అంత తీరిక లేనట్టుంది. చేసేది లేక సోనియాగాంధీనే బరిలోకి దిగుతోంది. మరి అమ్మ ఈ పోరాటాన్ని మొదలుపెడితే దాని కొనసాగింపు బాధ్యతనైనా రాహుల్ తీసుకొంటాడా?!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -