Tuesday, April 30, 2024
- Advertisement -

CAA రద్దు..25 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో

- Advertisement -

న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్.25 అంశాలతో 45 పేజీలో రూపొందించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి రిలీజ్ చేశారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మేనిఫెస్టోకు న్యాయ్ పత్ర అనే పేరును ఖరారు చేయగా ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమం ఎజెండగా మేనిఫెస్టోను రూపొందించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓసారి పరిశీలిస్తే పీఎంఎల్ఏ, సీఏఏ రద్దు,ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు,ఐపీసీ, సీఆర్సీపీ ఎవిడెన్స్ ,చట్టాల రద్దు,రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్,విద్యా రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు,వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ రద్దు,రైతులకు కనీస మద్దతు ధరపై హామీ వంటి అంశాలను ప్రకటించారు.

అలాగే అగ్నివీర్ స్కీమ్ రద్దు,ఆర్మీలో అమలులోకి మళ్లీ పాత రిక్రూట్మెంట్ స్కీమ్,రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ,పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం,ఉపాధి హామీ వేతనం రూ. 400,రైతులకు రుణమాఫీ , పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత,5 వేల కోట్ల రూపాయలతో యువత కోసం ప్రత్యేక నిధి,కులగణన ఆధారంగా రిజర్వేషన్‌లు అమలు,450 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ వంటి వాటిని మేనిఫెస్టోలో పొందుపర్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -