Friday, May 9, 2025
- Advertisement -

గడువులోగా పనులు పూర్తి చేయాలి -రాజీవ్ శర్మ

- Advertisement -

ఆగస్టులో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో వివిధ పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 771 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. కృష్ణా పుష్కారల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి 728 పనులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.

పుష్కర ఘాట్ల ఏర్పాటు, రోడ్ల వెడల్పు, కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, బారికేడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణాలు వంటివి వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే భక్తుల భద్రతకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం కావడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతుందని,  ముందే చర్యలు తీసుకుని ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చూడాలని రాజీవ్ శర్మ ఆదేశించారు.

పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్ధతో పాటు సెక్యూరిటీ మెష్ లు, మొబైల్ టవర్లు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ఇక ప్రత్యేక వైద్య బృందాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో  కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -