Thursday, May 8, 2025
- Advertisement -

వ‌ర్మ‌ను మూడు గంట‌ల‌పాటు విచారించిన పోలీస‌లు..

- Advertisement -

ఇటీవల వివాదాలను రేపిన గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ (జీఎస్టీ) అనే వెబ్‌ సిరీస్‌ విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ శనివారం సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు ముడుగంటలపాటు వర్మను పోలీసులు విచారించారు. విచార‌ణ‌లో వ‌ర్మ చెప్పిన‌ స‌మాధానాలు .

విచార‌ణ‌లో జీఎస్టీ’ సినిమాను తాను తీయలేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదని… కేవలం కాన్సెప్ట్ మాత్రమే తనదని వర్మ చెప్పారని తెలిపారు. కాన్సెప్ట్ ను మాత్రమే తాను అమ్మానని వెల్లడించారని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ ను సేకరించాల్సి ఉందని… అన్ని వైపుల నుంచి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ‘సత్యమేవ జయతే’ను ‘సత్య మియా జయతే’ అంటూ వర్మ ట్వీట్ చేసిన అంశాన్ని కూడా ఈ కేసులోనే చేరుస్తామని చెప్పారు.

నగ్నంగా ఉన్న మాల్కోవాతో వర్మ ఉన్న ఫొటోలను ఆయన ఫోన్, ల్యాప్ టాప్ నుంచి డౌన్ లోడ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని… ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత… ఈ ఫొటోలన్నీ ఎలా వచ్చాయి? మీరు ఏం తీశారు? ఎందుకు తీశారు? అనే విషయాలను తదుపరి విచారణలో ప్రశ్నిస్తామని డీసీపీ తెలిపారు. సినిమాను ఎక్కడ తీసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -