చైనాకు షాక్ తగిలింది. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఢిల్లీలో ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా మీడియాతో మాట్లాడుతూ చైనాను ఫేస్ చేసే సత్తా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఉందని ఓపెన్ గానే చెప్పేశారు.ఒకవేళ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఆపరేషన్ కు తమ బలగాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ధనోవా బాంబ్ పేల్చారు.
అలా అని తాము దూకుడుగా ఏమీ వెళ్లబోమని…కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్తేనే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. భారత ప్రభుత్వ ఆలోచనలకు తగిన రీతిలో నడుచుకునేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉందని ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా సుస్పష్టం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రెక్స్ చేపట్టాలంటే అది కేవలం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని ఆయన వెల్లడించారు. “మేము సిద్ధంగా ఉన్నాం.. ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.. ఏ సవాలునైనా ఎదుర్కొంటాం“ అని ధనోవా తేల్చి చెప్పారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో యుద్ధం (టూ-ఫ్రంట్ వార్) చేయాల్సి వస్తే సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా..“ అలాంటి ఆపరేషన్స్ చేపట్టడానికి మాకు 42 స్కాడ్రన్స్ అవసరమవుతాయన్నారు.
దాని కోసం ప్లాన్ బీ రెడీగా ఉంటుందని ధనోవా తెలిపారు. అలాగే డోక్లామ్ లోని చుంబీ లోయలో చైనా బలగాలు ఇంకా ఇప్పటికీ తిష్ట వేశాయని ..త్వరలో వారు మన బలాన్ని చూసి వెనక్కి వెళ్లిపోతాయన్నారు. భారత్-చైనా మధ్య 3488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వివాదాస్పదంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా టిబెట్ దక్షిణ ప్రాంతమని గత కొంతకాలంగా వాదిస్తున్న చైనా…అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో కొత్త ఎక్స్ ప్రెస్ హైవే ను ఆదివారం ప్రారంభించింది.ఈ సందర్భంగా మనమూ ఓసారి చైనాకు ఝలక్ ఇవ్వాలనే ధనోవా ఇలా మాట్లాడారని ఢిల్లీ పొలిటికల్ సర్క్యూట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.