ఏపీ తీరం లో రిలయెన్స్ గ్యాస్ , చమురు నిక్షేపాలు తీసుకోవడం కోసం వీలు కల్పించిన ప్రభుత్వం మీద ఇప్పటికే బాగా విమర్శలు వస్తున్నాయి. రిలయన్స్ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించారు అని దానికి ప్రత్యుపకారం కూడా జరిగిపోయింది అని వదంతులు కొత్తగా పుడుతున్నాయి.
రిలయన్స్ ఈ విషయంలో ఇబ్బందుకర పరిస్థితి ఎదురుకుంటోంది అంటున్నారు. రిలయన్స్ తమ ప్రాంతం తో పాటు ఆ దగ్గర లోంచి ప్రాంతాల్లో సముద్రం లోంచి గ్యాస్ తీసుకుంటున్న ఓ ఎన్జీ సి సరిహద్దులు అతిక్రమించింది అని రుజువైంది. రిలయన్స్ హద్దులు దాటి బావులు తవ్వుకుని దాదాపు 11,055 కోట్లు వెనకేసుకుందని అంచనా వేస్తున్నారు.ఈ విషయం లో ఓ ఎన్జీ సి రెండేళ్ళ క్రితం సుప్రీం కి ఎక్కింది.
దీంతో ఒక సర్వే సంస్థ అమెరికా నుంచి వచ్చి మరీ సర్వే మొదలు పెట్టింది. హద్దు ఎక్కడివరకూ – ఆక్రమణ ఎక్కడి వరకూ అనేది సముద్రం విషయం లో చెప్పడం చాలా కష్టం. అందుకే ఆ విషయం తేల్చ మని ఆ సంస్థ తో లావాదేవీ చేసుకున్నాయి రిలయన్స్ – ఓఎన్జీసీ లు.ఆ సంస్థ ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి, నివేదిక ఇచ్చింది.
ఆ నివేదికలో రిలయన్స్ సరిహద్దు ఆక్రమణ వాస్తవమే అని, ఈ విధంగా బావులు తవ్వి, ఇప్పటి వరకు 8981 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ పట్టుకుపోయి పదివేల కోట్లకు పైగా ఆర్జించిందని లెక్కలు కట్టింది. ప్రభుత్వానికి ఈ నివేదిక అందించి మరి రిలయన్స్ చేసిన పని రుజువైన క్రమంలో ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఆసక్తికరం.