Friday, April 26, 2024
- Advertisement -

ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారని అంటారా ?

- Advertisement -

ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా?.. ప్రశ్నించే వారిని పక్కపార్టీకి చెందిన వారిగానే భావిస్తారా ? మరి మీకు అధికారం ఇచ్చిన ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి ?.. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రస్తుతం ఏపీలో ఉన్న వైసీపీ నాయకుల తీరుపై వ్యక్తమౌతున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో లెక్కకు మించి పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. ఆ పథకాలు అందని వారు ప్రశ్నిస్తే వారిని ప్రతిపక్ష పార్టీకి చెందిన వారీగా లెక్కగాడుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం అని ప్రజాభిప్రాయాలను తెలుసు కునేందుకు ప్రజల్లోకి వచ్చిన నేతలకు ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. పథకాలు అమలు చేస్తే సరిపోదని, ఆ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరువౌతున్నాయో కూడా చూడాలని ప్రశ్నిస్తున్నారు..

అది చేశాం ఇది చేశాం అని చెప్పుకోవడం కాదు ముందు రోడ్లు బాగు చేయండి అంటూ నిలదీస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా ఆ మద్య అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ వంటి వారు కూడా ప్రజల నుంచి ఈ రకమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నవారే. ఇక తాజాగా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ కు కూడా ఆయన నియోజిక వర్గం నుంచి ఇదే రకమైన పరాభవం ఎదురైంది. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంక చాలా మంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలలు వారి నియోజిక వర్గాలలో ప్రజల నుంచి ఇదే రకమైన పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు.

అయితే ప్రశ్నించిన ప్రతివారిని ఇతర పార్టీ వారిగానే లెక్కగడుతున్నారు వైసీపీ నేతలు. . దీంతో ప్రజలు వారి బాధలు వ్యక్తం చేసే హక్కు కూడా లేదా? అంటూ ఏపీ ప్రజానీకం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఏపీలో అభివృద్ది తారస్థాయిలో జరుగుతోంది అనే భ్రమలో ఉంది వైసీపీ ప్రభుత్వం. ప్రతి ఒక్కరి అకౌంట్లో నగదు జమ చేసేందుకు బటన్ మాత్రమే నొక్కుతాను అని చెప్పే సి‌ఎం జగన్ను.. బటన్ నొక్కిటే అభివృద్ది జరుగుతుందా ? అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరి సామాన్యులు వేసే ఏ ఒక్క ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే విషయం అందరికీ తెలుసు.. అందుకే ప్రశ్నించిన వారిని ప్రతిపక్ష పార్టీలకు అంటగడుతున్నారనేది ఎవరు కాదనలేని వాస్తవం.

Also Read : కాంగ్రెస్ కు దురమౌతున్న గాంధీ కుటుంబం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -