Friday, May 17, 2024
- Advertisement -

పాపం.. ఇప్పుడు రేవంత్ కూతురి పెళ్లి పనులు ఎలా?!

- Advertisement -

నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రభావితం చేసిన వ్యవహారంలో ఇరుక్కొని ఇబ్బందుల్లో పడిపోయాడు తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలి రాజకీయ అవినీతి కేసుగా దీన్ని చెబుతున్నారు. ఏసీబీ కి రేవంత్ రెడ్డి వ్యవహారం విజువల్స్ తో దొరికిపోవడంతో ఇది ఎంత వరకూ వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరి నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వీడియో టేపుల్లో ఉన్న ఈ మాటలు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాల చర్చగా మారాయి!

తనను చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నాడని రేవంత్ చెప్పుకొన్నాడు. మహానాడు సమయంలోనే అది జరగాల్సిందని.. అయితే కూతురి పెళ్లి బాధ్యతల్లో బిజీగా ఉన్నందునే తను ఆ బాధ్యతను తీసుకోలేదని.. అది అయిపోగానే తాను తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును బుక్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించిన అనంతరం ఆయనను స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టు రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. మరి అన్ని రోజుల పాటు రేవంత్ జైల్లోనే ఉండాల్సి వస్తే.. ఆయన కూతురి పెళ్లి పనులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కూతురి పెళ్లి ఉందని.. పార్టీ అధ్యక్ష బాధ్యతలే తీసుకోని వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రం! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -