Tuesday, May 14, 2024
- Advertisement -

మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ టీజర్ కాపీనా..?!

- Advertisement -

ఈ మధ్యకాలంలో ఏ సినిమా జనాలను పలకరించినా.. దాని గురించి ‘కాపీ’ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మద్యలోనే ‘బాహుబలి’ సినిమా గురించి వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే.

ఆ సినిమా ఫస్ట్ లుక్ ఒక హాలీవుడ్ సినిమా ఇన్ స్పిరేషన్ తో వచ్చిందనే వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమా గురించి అలాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘శ్రీమంతుడు’ వంతు వచ్చింది. ఈ సినిమా టీజర్ కూడా కాపీనే అని కొంతమంది అంటున్నారు!

‘శ్రీమంతుడు’ టీజర్ ను హిందీ సినిమా ‘ధూమ్-3’ స్ఫూర్తితో ఈ టీజర్ ను రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఒక ఫోటోను కూడా చూపుతున్నారు. ధూమ్ -3 టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ లో ఆమిర్ ఎలాంటి పోజులో నిలబడి ఉంటాడో.. ‘శ్రీమంతుడు’ టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ లో మహేశ్ బాబు అలాంటి పోజులోనే కనిపిస్తున్నాడు.. కాబట్టి ఇది కాపీ అనేది ఆరోపణ.

అయితే ఇదంతా యాదృచ్చికంగా జరిగి ఉండవచ్చని. .దీన్నీ కాపీ అనడానికి లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ మాత్రం దానికే కాపీ అనడం విడ్డూరమని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఉన్నాయి మహేశ్ బాబు ‘శ్రీమంతుడు” టీజర్ పై వినిపిస్తున్న విశ్లేషణలు. వీటి సంగతిలా ఉంటే..  ఈ టీజర్ అభిమానులను ఆనందపెడుతోంది. దీంట్లో మహేవ్ లుక్స్ ను చూసి వారు “వావ్..” అంటున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -